హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. ‘96’ ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో కార్తీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
సత్యం సుందరం ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ? కథ ఎలా ఉండబోతోంది?
‘96’ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేస్తున్న సినిమా ఇది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా. రెండేళ్ళ క్రితం నా కోసం ప్రేమ్ దగ్గర ఓ కథ ఉందని నా ఫ్రెండ్ చెప్పాడు. కానీ ఆయన నాకు చెప్పడానికి భయపడుతున్నారు. నేనే మెసేజ్ చేశాను. అప్పుడాయన ఈ స్క్రిప్ట్‌ని చదవమని ఇచ్చారు. నాకు కే విశ్వనాధ్ గారి సినిమాలు ఇష్టం. కానీ ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. ఈ కథ చదివినప్పుడు అలాంటి ఒక మంచి సినిమా అవుతుందనిపించింది. చాలా రేర్ స్క్రిప్ట్. మనలోని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కథ ఇది. అన్నయ్యకి కథ చదవమని చెప్పాను. అన్నయ్యకి చాలా నచ్చింది. నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయి అన్నారు. ఖచ్చితంగా చేద్దామని చెప్పారు.
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న కోర్ ఎలిమెంట్ ఏమిటి?
అన్‌కండీషనల్ లవ్. మనకి ఫ్యామిలీ నుంచే అన్‌కండీషనల్ లవ్ దొరుకుతుంది. అలాంటి అన్‌కండీషనల్ లవ్‌ని చూపించే సినిమా ఇది. మన కల్చర్, రూట్స్ కి సంబధించిన స్టొరీ. చాలా మంచి హ్యుమర్ ఫీలింగ్ ఉన్న ఎమోషనల్ కంటెంట్. చాలా చోట్ల హ్యాపీ టియర్స్ వస్తాయి. ఊపిరి సినిమా చూసినప్పుడు చాలా బ్యూటీఫుల్ ఎమోషన్ ఉంటుంది కదా.. అలాంటి హ్యాపీ ఎమోషన్ ఏన్న కథ. ఇలాంటి కథ అరవింద్ స్వామీగారి నిజ జీవితంలో జరిగిందని తెలిసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆయన గ్రామంలోనే పుట్టి పెరిగారు. ఈ సినిమాలో అరవింద్ గారి క్యారెక్టర్లో ఆయన్ని తప్పితే మరొకని ఊహించలేం. మా క్యారెక్టర్ మధ్య చాలా మంచి కెమిస్ట్రీ ఉంటుంది.
తెలుగులో కంటే తమిళ్లో ఒక రోజు ముందు రావడానికి కారణం?
తెలుగులో ‘దేవర’ ఉంది. అది చాలా పెద్ద సినిమా. మా సినిమా రోజు తర్వాత రావడం బెటర్. రెండు చాలా డిఫరెంట్ ఫిలిమ్స్. అది ఒక వార్ లా ఉంటుంది. మాది సీతమ్మ వాకిట్లో లాంటి సినిమా.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఒక చిన్నపల్లెటూరిలో శారీ షాప్ నడిపే ఇన్నోసెంట్ లాంటి క్యారెక్టర్. తనకి లైఫ్ మీద ఎలాంటి అంచనాలు ఉండవు. చాలా చలాకీగా మాట్లాడే క్యారెక్టర్. చాలా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ క్యారెక్టర్.
గోవింద్ వసంత్ మ్యూజిక్ గురించి?
గోవింద్ వసంత్ మంచి కంపోజర్. ఈ కథ విని.. ఈ సినిమా నా ట్యాలెంట్‌ని ఛాలెంజ్ చేస్తుందని అన్నారు. ప్రతి సాంగ్ మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. నేపధ్య సంగీతం హంటింగ్‌గా ఉంటుంది. మ్యూజిక్ మన చైల్డ్ డేస్‌కి తీసుకెళుతుంది.
సి.ప్రేమ్ కుమార్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ఆయన చాలా ప్లానింగ్‌తో ఉండే డైరెక్టర్. ప్రతీది రెడీగా ఉంచుతారు. ఆయన గొప్ప అండర్స్టాండింగ్ ఉన్న డైరెక్టర్. అద్భుతమైన మాటలు రాశారు. ఈ కథ చదివినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండేదో యాక్ట్ చేసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది.
సూర్య గారు ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్ అయ్యారా?
సినిమా ప్రొడ్యూస్ చేయడం వరకే కానీ అన్నయ్య ఇన్వాల్ అవ్వరు. ఒక రోజు మాత్రం రాత్రి షూటింగ్‌కి రోలెక్స్ వచ్చారు. అందరికీ తెలిసిపోయి జనం వచ్చేశారు. కాసేపు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేశాం. సూర్య నా మొదటి సినిమా చూసి నన్ను హాగ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్‌గా హగ్ చేసుకున్నారు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశానని కాంప్లిమెంట్ ఇచ్చారు.
ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో రిలీజ్ చేయడం గురించి?
సునీల్ గారు ఈ సినిమా చేయాలని అడిగనప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆయన రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన జడ్జ్‌మెంట్‌పై నాకు నమ్మకం ఉంది.
డిల్లి, రోలెక్స్ ఫేస్ అఫ్ ఎప్పుడు?
నెక్స్ట్ ఇయర్ ఉంటుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి..?
సర్దార్ 2 జరుగుతోంది. వా వాతియారే అనే సినిమా ఉంది. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు