తమిళ హీరో కార్తీ నటించే సినిమాలకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసే ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది. ఇక ఆయన నటనకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు కార్తీ తన కొత్త సినిమా ‘సత్యం సుందరం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాలో మరో నటుడు అరవింద్ స్వామీ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కార్తీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అరవింద్ స్వామీ కూడా తనదైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటున్నాడు. ఓ ఫీల్ గుడ్ కథగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాను సి.ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశారు. సూర్య, జ్యోతిక ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ సినిమాలో రాజ్ కిరణ్, శ్రీదివ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.