ట్రెండింగ్ : శర్వానంద్ ‘ఒకేఒక జీవితం’ మూవీ కోసం కార్తీ స్పెషల్ సాంగ్


శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ఒకేఒక జీవితం. టైం ట్రావెల్ కథగా సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కిన ఈ మూవీలో అక్కినేని అమల ఒక కీలక రోల్ చేయగా శ్రీకార్తిక్ దీనిని తెరకెక్కిస్తున్నారు. నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు చేసిన ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని డ్రీమ్ రైటర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ సంయుక్తంగా ఎంతో భారీగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ అందుకోగా మూవీ నుండి ముచ్చటగా మూడవ సాంగ్ ని రేపు విడుదల చేయనుంది యూనిట్. అయితే ఈ సాంగ్ కి ఒక స్పెషలిటీ ఉండడం విశేషం. తమిళ స్టార్ యాక్టర్ కార్తీ పాడిన మారిపోయే అనే పల్లవితో సాగే ఈ సాంగ్ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ ప్రకటించింది.

నిజానికి ఈ సాంగ్ ఎవరు పాడారు అనే దాని గురించి నిన్న చిన్నపిల్లలతో ఒక వీడియో బైట్ రిలీజ్ చేసి హింట్ ఇచ్చింది యూనిట్. కాగా ఫైనల్ గా కార్తీ ఈ సాంగ్ పాడుతున్నారని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా సాంగ్ ఎలా ఉంటుందో అనే ఆసక్తిని కనబరుస్తున్నారు. మరోవైపు ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక ఈ మూవీని సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version