‘సత్యం సుందరం’కి సెన్సార్ U సర్టిఫికెట్

తమిళ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం’ సెప్టెంబర్ 28న తెలుగు రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ మూవీ ‘96’ ఫేం దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియట్ అయ్యింది. ఇక రీసెంట్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘దేవర’ రిలీజ్ తరువాత రోజున రిలీజ్ చేస్తున్నామని.. దేవర మాస్ ఫీవర్ వీక్షించి ‘సత్యం సుందరం’ క్లాస్‌ను కూడా వీక్షించాలని చిత్ర యూనిట్ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసింది.

అయితే, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘U’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రం గుడ్ ఫీల్ కథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు కథకు సంబంధించిన కంటెంట్ కూడా సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ అరవింద్ స్వామి కూడా నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా, సూర్య-జ్యోతిక ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version