‘తండేల్’ తమిళ్ ట్రైలర్ కోసం వస్తున్న కార్తీ

‘తండేల్’ తమిళ్ ట్రైలర్ కోసం వస్తున్న కార్తీ

Published on Jan 29, 2025 7:00 PM IST

అక్కినేని నాగ చైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తుంది.

పీరియాడిక్ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ చక్కటి లవ్ స్టోరీ మనకు చూపెట్టబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ‘తండేల్’ చిత్రానికి సంబంధించిన తమిళ ట్రైలర్‌ను జనవరి 30న సాయంత్రం 6 గంటలకు స్టార్ హీరో కార్తీ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దీంతో తమిళ్‌లో కూడా తండేల్ మూవీపై బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని.. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు