ట్రెండింగ్ : నార్త్ లో 2022 థర్డ్ బిగ్గెస్ట్ సౌత్ బ్లాక్ బస్టర్ గా ‘కార్తికేయ – 2’ నిలవనుందా ?

ట్రెండింగ్ : నార్త్ లో 2022 థర్డ్ బిగ్గెస్ట్ సౌత్ బ్లాక్ బస్టర్ గా ‘కార్తికేయ – 2’ నిలవనుందా ?

Published on Aug 24, 2022 1:00 AM IST


నిఖిల్ సిద్దార్థ, చందూ మొండేటి ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ కార్తికేయ 2 అన్ని ఏరియాల్లో భారీ స్థాయిలో కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఈ మిస్టరీ అడ్వెంచరస్ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అద్భుతంగా తెరకెక్కించారు యువ దర్శకుడు చందూ. అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ ఎంతో భారీగా నిర్మించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

మన భారతీయ సనాతన ధర్మం, సంప్రదాయాలను తెలిపే విధంగా శ్రీకృష్ణుని కీలక ఘట్ట కథాంశంతో ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కిన ఈ మూవీకి అటు నార్త్ ఆడియన్స్ సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే అక్కడ పలు ప్రాంతాల్లో అదరగొడుతున్న కార్తికేయ 2 రాబోయే రోజుల్లో 2022లో రిలీజ్ అయిన థర్డ్ బిగ్గెస్ట్ నార్త్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలవనున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. హీరో నిఖిల్ అద్భుత పెర్ఫార్మన్స్, అనుపమ అందం, ఆకట్టుకునే అభినయంతో పాటు భారీ విజువల్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, బీజీఎమ్, గ్రాండియర్ టేకింగ్, యాక్షన్ సీన్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా కార్తికేయ 2 భారీ సక్సెస్ కి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఇక ఇప్పటివరకు నార్త్ లో 16. 30 కోట్లనెట్ కలెక్షన్ ని ఈ మూవీ అందుకుని 4వ స్థానములో నిలిచింది. అయితే మూడవ స్థానంలో ఉన్న రాధేశ్యామ్ మూవీ 19. 30 కోట్ల నెట్ కలెక్షన్ ని సొంతం చేసుకోగా, మరికొద్దిరోజుల్లో కార్తికేయ 2 దీనిని దాటేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే కార్తికేయ 2 ప్రభంజనం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇక నార్త్ లో 2022లో హైయెస్ట్ నెట్ కలెక్షన్ సొంతం చేసుకున్న సౌత్ మూవీస్ వివరాలు ఇలా ఉన్నాయి.

కెజిఎఫ్ చాప్టర్ – 2 …. 434. 70 కోట్ల నెట్ కలెక్షన్
ఆర్ఆర్ఆర్ …. 274. 31 కోట్ల నెట్ కలెక్షన్
రాధే శ్యామ్ …. 19. 30 కోట్ల నెట్ కలెక్షన్
కార్తికేయ 2 ….. 16. 30 కోట్లు ,,
మేజర్ ….. 12. 71 కోట్లు ,,
విక్రాంత్ రోణా ….. 12. 00 కోట్లు ,,
విక్రమ్ ….. 06. 64 కోట్లు ,,
777 చార్లీ ….. 06. 55 కోట్లు ,,
బీస్ట్ ….. 02. 30 కోట్లు ,,
వాలిమై ….. 02. 10 కోట్లు ,,

సంబంధిత సమాచారం

తాజా వార్తలు