యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ క్రేజీ థ్రిల్లర్ చిత్రం “కార్తికేయ 2”. ఈ చిత్రం ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్స్ లో ఒకటిగా మాత్రమే కాకుండా హీరో నిఖిల్ కెరీర్ లో కూడా ఒక బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. తన కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాగా కూడా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోల జాబితాలో తాను నిలిచాడు.
ఇక ఇప్పటికీ కూడా థియేటర్స్ లో సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో ఈ చిత్రం ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ కి వస్తుందో తెలుస్తుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు జీ 5 వారు కొనుగోలు చేయగా ఈ చిత్రం అయితే అందులో అన్ని భాషల్లో ఈ సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంకి కాల భైరవ సంగీతం అందించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.