మన కల్చర్ ని గుర్తుచేస్తూ అందరినీ ఆకట్టుకునే అంశాలతో ‘కార్తికేయ 2’ రూపొందింది – హీరో నిఖిల్

Published on Aug 12, 2022 2:00 am IST

నిఖిల్ సిద్దార్ధ, అనుపమ పరమేశ్వరన్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీ ఎనిమిదేళ్ల క్రితం రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ కి సీక్వెల్ గా తెరకెక్కింది. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన కార్తికేయ 2 మూవీ ఆగష్టు 13న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సందర్భంగా నేడు హైదరాబాద్ లో ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ గా జరిపారు.

కాగా ఈ ఈవెంట్ కి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరోలు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ, సీనియర్ దర్శకడు సింగీతం శ్రీనివాసరావు, వి విజయేంద్రప్రసాద్ తదితరులు స్పెషల్ గెస్టులుగా విచ్చేసి యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. కాగా ఈ ఈవెంట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ, దాదాపుగా రెండున్నరేళ్ల నుండి తమ యూనిట్ కార్తికేయ 2 కోసం ఎంతో కష్టపడిందని, అలానే సినిమా కోసం కొన్ని రిస్కీ లొకేషన్స్ లో కూడా కష్టపడి చిత్రీకరించాం అన్నారు.

దర్శకడు చందూ మొండేటి ఈ మూవీ కథ, కథనాల పై పెట్టిన శ్రద్ధ అమోఘం అని, కొన్ని సందర్భాల్లో అతడితో కొద్దిపాటి చిన్న గొడవలు కూడా జరిగాయని,ఈ మూవీతో చందు పై అనుబంధం మరింతగా పెరిగిందన్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి కథాంశంతో సాగె ఈ మూవీ మన భారతీయ కల్చర్ ని సంప్రదాయాలను గుర్తు చేస్తూ అందరినీ ఆకట్టుకునే విధంగా యాక్షన్, ఎమోషనల్, థ్రిల్లింగ్, సస్పెన్స్, ఎంటర్టైనింగ్ అంశాలతో సాగుతుందన్నారు. తప్పకుండా ఆడియన్స్ అందరూ మూవీని థియేటర్స్ లో చూసి ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు హీరో నిఖిల్.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :