నార్త్ లో స్పెషల్ డే కి మరోసారి “కార్తికేయ 2” సెన్సేషన్.!

Published on Sep 22, 2022 3:36 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “కార్తికేయ 2”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సాలిడ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పుడు 50 రోజులకి దూసుకెళ్తుంది. మరి అప్పట్లో కార్తికేయ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ఇప్పుడు ఈ సినిమా అంతకు మించి భారీ హిట్ అయ్యింది.

మన తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా సెన్సేషనల్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ ఏడాదిలో సెప్టెంబర్ 25న నేషనల్ సినిమా డే కి గాను మళ్ళీ చిత్రం అదిరే లెవెల్లో బుకింగ్స్ నమోదు చేసుకుంటుంది. ఢిల్లీ, ముంబై పూణే తదితర ప్రాంతాల్లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ నమోదు చేస్తుందని హీరో నిఖిల్ ఈ స్పెషల్ డే తమ సినిమా సెన్సేషన్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని అయితే చందూ మొండేటి దర్శకత్వం వహించగా కాల భైరవ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :