వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “కార్తికేయ2”


థియేటర్లలో మరియు ఓటిటి లో ప్రేక్షకుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ పొందిన తరువాత, నిఖిల్ సిద్ధార్థ్ యొక్క కార్తికేయ 2 టెలివిజన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా హిందీ వెర్షన్ జీ సినిమాలో నవంబర్ 27, 2022 న రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. తెలుగు వెర్షన్ కూడా అదే రోజున వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ గా ప్రసారం చేసే అవకాశం ఉంది.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష చెముడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణం వహించాయి.

Exit mobile version