కార్తికేయ నెక్స్ట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్!

కార్తికేయ నెక్స్ట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్!

Published on Apr 11, 2024 6:43 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ చివరిసారిగా బెదురులంక 2012 లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. కార్తికేయ తదుపరి ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం లో తెరకెక్కుతున్న కార్తికేయ8 లో కనిపించనున్నారు. ఈ చిత్రం కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు రంజాన్ పండుగ సందర్భంగా వెల్లడించారు.

ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 12 న మధ్యాహ్నం 12:06 గంటలకి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం లో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు