ఇంట్రెస్టింగ్ టైటిల్ తో యంగ్ హీరో కార్తికేయ నెక్స్ట్ ప్రాజెక్ట్..!

Published on Sep 21, 2022 1:00 pm IST

తన టాలెంట్ తో టాలీవుడ్ సినిమా దగ్గర హీరో గానే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ కూడా విలన్ గా స్టార్ హీరో అజిత్ లాంటి నటుడితో కనిపించి తాను ఇంప్రెస్ చేసాడు. ఇక ఇప్పుడు తెలుగులో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో తాను సిద్ధంగా ఉండగా ఇప్పుడు వాటిలో ఓ సినిమా ఇంట్రెస్టింగ్ టైటిల్ సహా పోస్టర్ ని రిలీజ్ చేసారు.

సినిమాకి “బెదురులంక 2012” అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నేహా శెట్టి ని ఫిక్స్ చేసినట్టు రివీల్ చేశారు. ఇక అలాగే దీనితో పాటుగా సినిమా పోస్టర్ చూసినట్టు అయితే చుట్టూ సముద్రంతో మధ్యలో ఓ పచ్చని దీవి పై నుంచి ఓ కృష్ణ పక్షి తో మంచి ఆసక్తిగా ఉంది. అయితే ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు క్లాక్స్ దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :