త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “కార్తీకేయ2”


నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన సూపర్ నాచురల్ అడ్వెంచర్ థ్రిల్లర్ కార్తికేయ2. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. టాలీవుడ్ లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం నార్త్ లోనూ అదరగొడుతోంది. అయితే ఈ చిత్రం త్వరలో బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

జీ తెలుగు లో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాకుండా, అతని కెరీర్ కి చాలా ప్లస్ అయింది ఈ చిత్రం. మరి టెలివిజన్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version