కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్. ఈ చిత్రం లో డ్యూయల్ రోల్ లో నటించిన కార్తీ, తెలుగు మరియు తమిళ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది. నవంబర్ 18 నుండి ఈ చిత్రం ఆహా వీడియో లో ప్రసారం కానుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో డీల్ చేసిన ఈ థ్రిల్లర్‌లో రాశి ఖన్నా మరియు రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు. పి.ఎస్. మిత్రన్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చంకీ పాండే, లైలా, మునిష్కాంత్ కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ సంగీతం అందించారు. థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయిన వారు ఇప్పుడు నవంబర్ 18 నుండి ఆహాలో ఆస్వాదించవచ్చు.