డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న కార్తీ “విరుమాన్”

Published on Aug 12, 2022 12:00 pm IST


కోలీవుడ్ హీరో కార్తీ మళ్లీ విరుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితి శంకర్ తొలిసారిగా నటిస్తోంది. తాజా సమాచారం ఏమిటంటే, విరుమాన్ తన స్ట్రీమింగ్ పార్ట్ నర్ ను లాక్ చేసాడు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కైవసం చేసుకుంది. మంచి సమీక్షలతో దూసుకు పోతున్న ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, ప్రకాష్ రాజ్, శరణ్య తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :