యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ పతాకంపై యంగ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భజే వాయు వేగం. ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ని తెరకెక్కించారు. అజయ్ కుమార్ రాజు. పి. సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రం రిలీజ్ డేట్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను మే 25 వ తేదీన మధ్యాహ్నం 12:15 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మరియు పంపిణీదారుడు అయిన ధీరజ్ మొగిలినేని తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ ద్వారా భారతదేశం అంతటా విడుదల చేస్తున్నారు.