‘ఓజి’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన ‘మట్కా’ మేకర్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ నుంచి నేడు టీజర్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కరుణ కమార్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. ఇక ఈ టీజర్ ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు కరుణ కుమార్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘మట్కా’ టీజర్ లాంచ్ వేడుకలో అభిమానులు ‘ఓజి’ అని కేకలు వేస్తుండటంతో వారికి ఓ సాలిడ్ వార్త చెప్పారు దర్శకుడు కరుణ కుమార్. ఓజి షూటింగ్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందని.. అది పూర్తవగానే ఓజి షూటింగ్ పూర్తవుతుందని ఆయన అన్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఓజి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో నెలకొన్నాయి.

Exit mobile version