పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ‘తొలిప్రేమ’ చిత్రానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాతో పవన్ మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. అభిమానుల్లో సైతం ఈ సినిమాకు ఇప్పటికీ కల్ట్
క్రేజ్ ఉంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది కరుణాకరన్. ఇదే కాదు ప్రభాస్ హీరోగా ‘డార్లింగ్’ సినిమా చేసి మెప్పించిన కరుణాకరన్ మంచి హిట్ అందుకుని చాలా కాలమే అయింది. 2018 ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమాతో పలకరించిన ఈయన మళ్లీ మూడేళ్ళ తర్వాత సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇన్నాళ్లు కథలు రాసుకునే పనిలో ఉన్న ఆయన అవి పూర్తికావడంతో రంగంలోకి దిగుతున్నారు.
రెండు కథలను పూర్తిగా రెడీ చేసి పెట్టుకున్న ఆయన యువ హీరోలను అప్రోచ్ అవుతున్నారట. ఇప్పటికే ఒక యంగ్ హీరోకి కథ వినిపించారని, ఆ హీరో కూడ కరుణాకరన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే వీరి సినిమా పట్టాలెక్కనుందట. ఇది మొదలుకాకముందే ఇంకొక హీరోకి కూడ కథ వినిపించే ప్రయత్నాల్లో ఉన్నారట కరుణాకరన్. ఈ రెండు కథలు కూడ ప్రేమ కథలేనని తెలుస్తోంది. మరి ఒకప్పుడు తన ప్రేమ కథలతో ఇంప్రెస్ చేసిన కరుణాకరన్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.