తమిళ స్టార్ హీరో ఇలయదలపథి విజయ్ నటించిన ‘కత్తి’ సినిమా నిన్న తమిళనాడులో విడుదలై సూపర్ హిట్ టాక్ అయ్యింది. ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంతో విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ సృష్టించింది.
దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజులు దాటినా ఈ సినిమా తమిళనాడులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ కమర్షియల్ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా కనిపించాడు. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యింది. తమిళంలో సమంత ఈ సినిమాతో మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.