హిందీ ‘ఖైదీ’తో కత్రినా కైఫ్ !

హిందీ ‘ఖైదీ’తో కత్రినా కైఫ్ !

Published on Aug 16, 2020 1:12 AM IST

తమిళ సినిమా ‘ఖైదీ’ తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. ఈ మధ్య దక్షిణాది పరిశ్రమల సినిమాల పై ఆసక్తిగా ఉన్న బాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్రం బాగా నచ్చింది. స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా ఈ చిత్రాన్ని చూసి వెంటనే డేట్స్ ఇచ్ఛేశాడు. కానీ అంతలో కరోనా రావడంతో ఈ సినిమా షూటింగ్ వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ హిందీ వెర్షన్ లో అజయ్ దేవగణ్ భార్య పాత్రను కూడా యాడ్ చేస్తున్నారట. ఆ పాత్రలో కత్రినా కైఫ్ నటించబోతుంది.

ఇక నవంబర్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని గ్యాప్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లోనే ఖైదీని పూర్తి చేయాలని అజయ్ దేవగణ్ టార్గెట్ పెట్టుకున్నాడట. దాని కోసం సెట్స్ ను కూడా వేయబోతున్నారని తెలుస్తోంది. కార్తి హీరోగా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. మరి అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తోందో చూడాలి. ఇక కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు