యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కావ్య థాపర్ విలేకరులతో ముచ్చటించింది.
డబుల్ ఇస్మార్ట్ సినిమాలోకి ఎలా వచ్చారు?
పూరి సర్, ఛార్మి గారికి నా ఆడిషన్ నచ్చింది. అయితే ఆ సమయంలో ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా కాస్త వెయిట్ పెరిగాను. రెండు నెలలు హార్డ్ వర్క్ చేసి వెయిట్ తగ్గాను. పూరి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ కి ఫిట్ అయ్యాను. ఇంత అద్భుతమైన కాంబినేషన్ ఉన్న సినిమాలో వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. రామ్ గారు, సంజయ్ దత్ లాంటి బిగ్ స్టార్స్ ఉన్న సినిమాలో నేనూ పార్ట్ కావడం చాలా హ్యాపీగా వుంది.
ఇందులో మీ పాత్ర ఎలా వుండబోతోంది ?
ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైనా సొంతంగా నేర్చుకునే అమ్మాయి. తను చాలా స్మార్ట్, అదే సమయంలో తనలో ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది. ఇందులో నాకు ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.
రామ్ తో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది ?
అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా ఎనర్జీ, పవర్ కావాల్సిన సాంగ్ లో సిక్ అవ్వడంతో చాలా అప్సెట్ అయ్యాను. అయినా సెట్ లోకి వచ్చాను. అయితే ఛార్మి గారు నన్ను చూసి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. చాలా కేర్ తీసుకున్నారు. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిస్చార్జ్ అయ్యాను. నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. రామ్ గారు చాలా ప్యాషనేట్ యాక్టర్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హైలీ ఎనర్జిటిక్ గా ఉంటారు. తను అమేజింగ్ పర్సన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా కెమిస్ట్రీ చాలా బాగా వచ్చింది.
సంజయ్ దత్ గారితో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా?
అవును ఉన్నాయి.. సంజయ్ దత్ తో వర్క్ చేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన లెజండరీ యాక్టర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం డ్రీమ్ కమ్ ట్రూ లా అనిపించింది.
పూరి గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు..?
ఓర్పుగా ఉండటంతో పాటు చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన విజన్ చాలా క్లియర్ గా ఉంటుంది. సెట్ లో చాలా కూల్ గా ఉంటారు. ఆయనలో మంచి ఫిలాసఫర్ కూడా ఉన్నారు.
ఛార్మి గారితో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
ఛార్మి మేడమ్ బాస్ లేడీ. నన్ను చాలా కేరింగ్ గా చూసుకున్నారు. తను పవర్ హౌస్. చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు.
ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉండబోతోంది..?
డబుల్ ఇస్మార్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ లా ఉంది. ఇస్మార్ట్ శంకర్ కి దీనికి పోలిక లేదు. కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేశాను. ఆగస్టు 15 కోసం ఎదురుచూస్తున్నాను.
డబుల్ ఇస్మార్ట్ లో మీ ఫేవరేట్ సాంగ్..?
మార్ ముంత ఛోడ్ చింతా, స్టెప్పా మార్ సాంగ్స్ నా ఫేవరేట్. అవి నా మైండ్ నుంచి పోవడం లేదు. మణిశర్మ గారు లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్ కి డ్యాన్స్ చేయడం లక్కీగా భావిస్తున్నాను.
డబుల్ ఇస్మార్ట్ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కదా.. ఎలా అనిపిస్తుంది..?
డబుల్ ఇస్మార్ట్ స్ట్రైట్ గా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా ఇదొక బ్లెస్సింగ్ లా భావిస్తున్నాను.
మున్ముందు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది..?
నాకు యాక్షన్ రోల్స్ చేయాలని ఉంది. యాక్షన్ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే అడ్వెంచరస్ మూవీ చేయాలని ఉంది.
మీ నెక్ట్స్ ప్రాజెక్టులు ఏమిటి..?
గోపీచంద్ గారితో విశ్వం చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.