ఓటీటీలోకి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’.. కయాదు వీడియో వైరల్!

తమిళ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ నటించిన రీసెంట్ మూవ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ కథగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించగా అందాల భామలు అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో కయాదు లోహర్ ఒక్కసారిగా సెన్సేషనల్ క్రేజ్ దక్కించుకుంది.

ఇక ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని కయాదు ఓ వీడియో రూపంలో ప్రమోట్ చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఇంటిల్లిపాదిని అలరిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.

ఈ వీడియోలో ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిని చూపుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

Exit mobile version