ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. 24 మార్చి 2023 న విడుదల కానున్న మెగా బ్లాక్‌బస్టర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ టిక్కెట్ ఫ్రాంచైజీగా ఉన్న లయన్స్‌గేట్, జాన్ విక్ నటించిన గ్లోబల్ ఐకాన్ కీను రీవ్స్ కొత్త అధ్యాయంతో తిరిగి వచ్చారు. మొదటి మూడు చిత్రాల విజయం తర్వాత, జాన్ విక్ అలియాస్ బూగీమాన్ జాన్ విక్ చాప్టర్ 4తో తన శత్రువులపై అల్లకల్లోలపు విధ్వంసపు దాడిని సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాడు.
కొత్త అధ్యాయానికి సంబంధించి కీను రీవ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మేము మునుపటి జాన్ విక్ చిత్రాల ప్రపంచ నిర్మాణాన్ని చాలా సరదాగా, ఊహించని పరిణామాలతో మరియు పాత్రలతో విస్తరించాము. మేము జాన్ విక్ యాక్షన్ కొత్త స్థాయిలకు తీసుకు వెళ్లేందుకు నూతన ఆయుధాలను, మజిల్ కార్లతో తిరిగి వచ్చాము. ఈ కథలో, విన్‌స్టన్ ప్రతీకారం తీర్చుకోవడంలో, అసాధ్యమైన పరిస్థితి నుంచి తప్పించుకోవడంలో మాస్టర్ అయిన విక్‌కు ఉన్న ఏకైక మార్గాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు” అని వివరించారు.
కథాంశం గురించి ఈ నటుడు మరింత వివరిస్తూ, “జాన్‌కు చాలా మంది స్నేహితులు లేనప్పటికీ, కానీ అతనికి సోదరభావం, స్నేహం మరియు త్యాగ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. జాన్, కెయిన్ మరియు షిమాజు ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తారు. హంతకుడైన కెయిన్, ఆట నుంచి బయట పడినప్పటికీ తన కుమార్తెను రక్షించుకునేందుకు తప్పనిసరి పరిస్థితులలో తిరిగి వస్తాడు. అలాగే షిమాజుకు ఒక కుమార్తె కూడా ఉంటుంది. జాన్ పట్ల విధేయతకు షిమాజు మూల్యం చెల్లించవలసి ఉంటుంది” అని అన్నారు.
లయన్స్‌గేట్ మరియు పీవీఆర్ పిక్చర్స్ భారతదేశంలో జాన్ విక్ చాప్టర్ 4ని 24 మార్చి 2023 న థియేటర్‌లలో విడుదల చేస్తాయి. ఇది 2019 లో విడుదల అయిన జాన్ విక్ చాప్టర్ 3 పారాబెల్లమ్‌కి సీక్వెల్, మరియు కీను రీవ్స్ సిరీస్‌లో పెద్ద చిత్రం కానుంది.