టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “కీడా కోలా”

టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “కీడా కోలా”

Published on Jul 21, 2024 7:00 PM IST

తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన క్రైమ్ కామెడీ చిత్రం కీడా కోలా. థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. OTT స్పేస్‌లో డిజిటల్ గా కూడా అరంగేట్రం చేసిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

స్టార్ మా లో ఈ చిత్రం ఆగస్ట్ 11, 2024 న మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రసారం కానుంది. కీడా కోలాలో బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, రఘు రామ్, జీవన్ కుమార్, విష్ణు ఓయ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి సమర్పణలో విజి సైన్మా ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు