రాజమౌళి సీక్రెట్ టాలెంట్ బయటపెట్టిన కీరవాణి.

రాజమౌళి సీక్రెట్ టాలెంట్ బయటపెట్టిన కీరవాణి.

Published on Oct 11, 2014 4:58 PM IST

Keeravani
రాజమౌళి గొప్ప దర్శకుడు అనే విషయం ప్రేక్షకులు అందరికి తెలుసు. అతనిలోని సీక్రెట్ టాలెంట్ ను బయటపెట్టారు ప్రముఖ సంగీత దర్శకులు, రాజమౌళి పెద్దన్నయ్య కీరవాణి. ఈ దర్శకధీరుదు గొప్ప సింగర్ అట. తాజా ఇంటర్వ్యూలో కీరవాణి ఈ విషయం వెల్లడించారు. నంది (ఇంట్లో అందరూ రాజమౌళిని ఇలానే పిలుస్తారు) పాటలు బాగా పాడతాడు, ముఖ్యంగా మెలోడీ పాటలను అద్బుతంగా పాడతాడు అని కీరవాణి చెప్పారు. ఈ వార్త ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించేదే.
రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి’కి స్వరాలను సమకూర్చే పనిలో బిజీగా ఉన్నారు కీరవాణి. అసలు రాజమౌళి దర్శకత్వం వహించే ప్రతి సినిమాకు కీరవాణి సంగీతం అందించడం కామన్. మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో కొన్ని సందర్భాలలో వీరిద్దరూ విభేదించుకుంటారట. మంచి స్వరాలు రావడానికి మా మధ్య మ్యూజిక్ సిట్టింగ్స్, డిస్కషన్స్ ఎంతో ఉపయోగపడతాయని కీరవాణి తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు