నాని “దసరా” నుండి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!


నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా. ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ దసరా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రను పోషిస్తుంది. పెళ్లి కూతురు గెటప్ లో కీర్తి సురేష్ సంతోషం గా కనిపిస్తుంది ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో.

ఈ చిత్రం తెలుగు తో పాటుగా, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది మార్చ్ 30, 2023 న థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వహబ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version