డిసెంబర్‌లో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేష్

అందాల భామ కీర్తి సురేష్ దక్షిణాదిన తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. మహానటి చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ‘బేబీ జాన్’ అనే సినిమాలో వరుణ్ ధావన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి చాలా రోజులుగా పలు వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

వాటిని నిజం చేస్తూ కీర్తి సురేష్ తాను ప్రేమలో ఉన్నట్లుగా రీసెంట్‌గా ప్రకటించింది ఈ బ్యూటీ. అయితే, ఇప్పుడు తన పెళ్లిపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది కీర్తి సురేష్. తాజాగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా డిసెంబర్‌లో తన పెళ్లి ఉందని.. అలాగే తన నెక్స్ట్ మూవీ ‘బేబీ జాన్’ రిలీజ్‌కు సిద్ధమైనందున తిరమలకు వచ్చినట్లు ఆమె తెలిపింది. అంతేగాక, తన పెళ్లి గోవాలో జరగనుందని కూడా కీర్తి సురేష్ తెలిపింది.

ఇక కీర్తి సురేష్ ఆంటోనీ తటిల్ అనే బిజినెస్‌మెన్‌ను ప్రేమ వివాహం చేసుకునేందుకు రెడీ కావడంతో అభిమానులు ఈ పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version