ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కీర్తి సురేష్ “రఘు తాత”


మన సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి టాలెంటెడ్ స్టార్ హీరోయిన్స్ లో నటి కీర్తి సురేష్ కూడా ఒకామె. మరి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రీసెంట్ గా నటించిన చిత్రమే “రఘు తాత”. దర్శకుడు సుమన్ కుమార్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ కామెడీ డ్రామా తమిళ్ లో గత నెలవిడుదల అయ్యింది. అయితే తెలుగులో కూడా రిలీజ్ కి ప్లాన్ చేశారు కానీ సినిమా కేవలం తమిళ్ వెర్షన్ లో మాత్రమే విడుదల అయ్యింది.

మరి అప్పుడు థియేటర్స్ లో తెలుగు రిలీజ్ మిస్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ 5 సంస్థ తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో నేటి నుంచి ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు. జీ 5 లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రంలో ఎం ఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్ లాంటి టాలెంటెడ్ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version