చిరుకి చెల్లెలు సెట్టైందోచ్.. ఆ స్టార్ హీరోయినే

Published on Oct 28, 2020 1:14 am IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి మూడు ప్రాజెక్టులను సెట్ చేసి పెట్టున్నారు. వాటిలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ ఒకటి కాగా రెండోది వినాయక్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్, ఇంకొకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్. రెండు రీమేక్ సినిమాల పనులు ఒకేసారి జరుగుతున్నాయి. స్క్రిప్ట్ రెడీ చేయటం, నటీనటులు ఎంపిక వేగంగా జరిగిపోతున్నాయి. తాజా సమాచారం మేరకు ‘వేదాళం’ రీమేక్లో చిరు చెల్లెలిగా స్టార్ హీరోయిన్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.

ఆమె మరెవరో కాదు కీర్తి సురేష్. దక్షిణాది సినీ పరిశ్రమల్లో స్టార్ కథానాయకిగా కొనసాగుతున్న కీర్తి చిరంజీవి ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమాకు ఓకే చెప్పి ఉండవచ్చు. మొదట్లో సాయి పల్లవి పేరు వినిపించినా చివరికి కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు. అన్నా చెల్లెళ్లుగా చిరు, కీర్తిల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. ‘ఆచార్య’ పూర్తయ్యాక చిరు ఈ రెండు రీమేక్ చిత్రాల్లో దేన్ని ముందుగా మొదలుపెడతారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More