రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ కూడా ఇప్పటికే లాక్ అయ్యింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్‌లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను కిరణ్ కోలా డైరెక్ట్ చేయనున్నాడు. కాగా, ఈ సినిమాకు ‘రౌడీ జనార్థన్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కీర్తి సురేష్‌ని మేకర్స్ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది.
గతంలో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ చిత్రంలో విజయ్ దేవరకొండ నటించాడు. ఇక ఇప్పుడు విజయ్ సరసన హీరోయిన్‌గా కీర్తి నటిస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి నిజంగానే ఈ సినిమాలో కీర్తి విజయ్‌తో రొమాన్స్ చేయనుందా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.