కీర్తి సురేష్‌కు పేరు తెచ్చిన కష్టం..!

అందాల భామ కీర్తి సురేష్ తన క్యూట్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించి, దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా మారింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా సాలిడ్ మూవీతో ఇచ్చింది ఈ స్టార్ బ్యూటీ. వరుణ్ ధావన్ నటించిన ‘బేబీ జాన్’ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఇప్పుడు కీర్తి సురేష్‌కు తన పేరు కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది.

ముంబైలో స్టార్స్ ఎక్కడ కనిపిస్తే, అక్కడ వాలిపోతారు పాప్పరాజి(ముంబై సినిమా ఫోటోగ్రాఫర్లు). ఇలా రీసెంట్‌గా ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్ వారి కంట పడింది. దీంతో ఆమెను ఫోటోలు తీసుకునే క్రమంలో ఆమె పేరును వారు తప్పుగా పలికారు. ‘కృతి ఇటు చూడండి’ అంటూ వారు అనడంతో.. తన పేరు కీర్తి అని.. కృతి కాదు అని ఆమె తెలిపింది.

అయినా కూడా వారు ఆమెను ‘కీర్తి దోశ’ అంటూ పిలిచారు. దీంతో మరోసారి తన పేరు కీర్తి సురేష్ అని, దోశ కాదని ఆమె తెలిపింది. ఇలా కీర్తి సురేష్‌కి తన పేరు వల్ల కలిగిన కష్టానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Exit mobile version