తెలుగులో “కేరళ 2018” 5 రోజుల వసూళ్లు.!

Published on May 31, 2023 1:03 pm IST


రీసెంట్ మాలీవుడ్ సెన్సేషన్ చిత్రం “కేరళ 2018” అక్కడ రికార్డులు సృష్టిస్తున్న సమయంలోనే తెలుగులో కూడా ఎలాంటి ప్రమోషన్స్ పెద్దగా లేకుండానే రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకోగా లేటెస్ట్ గా అయితే వీక్ డేస్ కి వచ్చిన స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరిచింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం సోమవారం తరహాలోనే ఇప్పుడు మంగళవారం వసూళ్లు కూడా అదరగొట్టినట్టుగా తెలుస్తుంది.

దీనితో అయితే ఈ సినిమా మొత్తం ఈ 5 రోజుల్లో టోటల్ గా 6.46 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి స్టడీ గా దూసుకెళ్తుంది. మరి ఈ సినిమా ఫైనల్ రన్ ఎంతవరకు వచ్చి ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో టొవినో థామస్, అపర్ణ బాలమురళీ, నటుడు నరైన్, కళాయిరాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా జూడే అంథోని జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే తెలుగులో ఈ చిత్రాన్ని అయితే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం :