రెండవసారి కోర్టు నోటీసులు అందుకున్న తమన్నా

రెండవసారి కోర్టు నోటీసులు అందుకున్న తమన్నా

Published on Jan 27, 2021 8:30 PM IST

ఇండియాలో క్రికెట్, రమ్మీలకు ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాప్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్ లైన్ బెట్టింగ్ అన్నమాట. ఈ యాప్స్ మీద అనేక ఆరోపణలున్నాయి. చాలా మంది ఎంతో డబ్బును కోల్పోయారని, ఆర్థికంగా చితికి అప్పులపాలయ్యారని అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఆన్ లైన్ రమ్మీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు నిషేధించడం జరిగింది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కోసం సెలబ్రిటీలు ప్రచారకర్తలుగా వ్యవహరించడం కూడ వివాదాస్పదమైంది.

తాజాగా కేరళ హైకోర్టులో త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్‌ ఈ గేమ్స్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్ ‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్ ‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ పిల్ దాఖలు చేశారు. దీని మీద విచారణ జరిపిన కేరళ హైకోర్టు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, మాలీవుడ్‌ నటుడు అజు వర్గీస్‌, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి నోటీసులు జారీ చేసింది. గతంలో మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ సైతం ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్లకు ప్రచారకర్తలుగా ఉన్నందుకు కొందరు సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది. వాటిలో కూడ తమన్నా పేరు ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు