ఆ నటుడి ఇంట విషాదం

జబర్దస్త్‌ హాస్య నటుడు కెవ్వు కార్తిక్‌ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ పోస్ట్ కెవ్వు కార్తిక్‌ ఎందుకు పెట్టాడంటే.. ఆయన ఇంట విషాదం నెలకొంది. కొంతకాలంగా కేన్సర్స్‌తో పొరాటం చేస్తున్న ఆయన తల్లి ఈ లోకాన్ని విడిచారు. దీంతో, కెవ్వు కార్తిక్‌ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ ను పెట్టారు.

‘ఐదు సంవత్సరాలుగా క్యాన్సరే భయపడే విధంగా దానితో పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్థమే. మమ్మల్ని, నాన్నను కంటికి రెప్పలా చూసుకున్నావ్‌. కష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడావు. దేనితోనైనా ఒంటరిగా ఎలా పోరాటం చేయాలో ఈ 5 ఏళ్లలో నేర్పించావు. నాలో ధైర్యాన్ని నింపావు. అన్నీ నేర్పావు.. కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు’ అని కెవ్వు కార్తిక్‌ తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అదేవిధంగా తన మాతృమూర్తికి చికిత్స చేసిన డాక్టర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version