‘తండేల్’లో కీలక ఎపిసోడ్.. ఫ్యాన్స్‌లో టెన్షన్..?

‘తండేల్’లో కీలక ఎపిసోడ్.. ఫ్యాన్స్‌లో టెన్షన్..?

Published on Jan 31, 2025 3:00 AM IST

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ కీలక ఎపిసోడ్ ఉంటుందని.. ఇది సినిమాకే కోర్ పాయింట్‌గా ఉండబోతుందని దర్శకుడు చందూ మొండేటి తెలిపారు.

కానీ, ఇప్పుడు ఇదే ఎపిసోడ్ అభిమానుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తుందట. ఈ సినిమాలో ఏపీ జాలర్లు పాకిస్థాన్ నేవీ కి చిక్కడంతో వారిని అరెస్ట్ చేస్తారు. అయితే, వారు పాకిస్థాన్ నుంచి ఎలా తప్పించుకున్నారనేది ఈ సినిమా కథ. కానీ, ఈ ఎపిసోడ్ మొత్తం కేవలం 20 నిమిషాలే ఉంటుందని.. మిగతా సినిమా కథలో చైతూ-సాయి పల్లవి మధ్య లవ్ స్టోరీనే ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

దీంతో ఇలాంటి కీలక ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలే ఉంటే ఎలా అని.. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ ఎపిసోడ్ రన్‌టైమ్ మరింత ఉంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు