ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున పలు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి అంతకు ముందే టీజర్ ను విడుదల చేసి ఈ సినిమాపై అంచనాలు మరింత స్థాయిలో పెంచేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో భారీ అనౌన్సమెంట్ ను మేకర్స్ అందించారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో ఆ రిలీజ్ డేట్ ను ఈరోజు సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం మరి ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు. మరి అలాగే ఈ భారీ చిత్రాన్ని హోంబలె నిర్మాణ సంస్థ వారు నిర్మించారు.