“కేజీయఫ్ 2” టెలికాస్ట్ పై మాసివ్ అనౌన్సమెంట్ వచ్చేసింది.!

Published on Aug 12, 2022 11:09 am IST


కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలవగా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది.

మరి మన తెలుగులో ప్రముఖ ఛానల్ జీ తెలుగు వారు ఈ సినిమా టెలికాస్ట్ హక్కులు సొంతం చేసుకోగా ఫైనల్ గా ఈ టెలికాస్ట్ డేట్ ని అయితే అనౌన్స్ చేసేసారు. ఈ చిత్రాన్ని ఈ ఆగస్ట్ 21న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారం చేయనున్నట్టుగా ఒక మాసివ్ అనౌన్సమెంట్ ని అందించారు. అలాగే దీనిపై ఆఫ్ లైన్ లో భారీ కటౌట్ తో ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసిన విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మొత్తానికి అయితే కేజీయఫ్ 2 తెలుగులో ప్రసారానికి సిద్ధం అయిపొయింది.

సంబంధిత సమాచారం :