ఫోటో మూమెంట్ : భార్య రాధికతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న కెజిఎఫ్ స్టార్ యష్

Published on Jul 21, 2022 12:00 am IST

కెజిఎఫ్ సినిమాల హీరో యష్, ఆ సిరీస్ లోని రెండు సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్ సిరీస్ లోని రెండు సినిమాలు ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి గొప్ప విజయాలు సొంతం చేసుకున్నాయో అందరికి తెలిసిందే. ఇక ఇటీవల చాప్టర్ 2 భారీ సక్సెస్ అనంతరం తన ఫ్యామిలీతో కలిసి హాలిడే టూర్స్ ఎంజాయ్ చేస్తున్న హీరో యష్, ప్రస్తుతం భార్య రాధికా పండిట్ తోపాటు ఇటలీ వెళ్లారు.

అక్కడి ఫేమస్ ప్రదేశాలను చుట్టేస్తున్న ఈ జంట అక్కడి అందాలను ఆస్వాదించడంతో పాటు ఇటలీ ఫేమస్ ఫుడ్ చీజ్ ఫుడ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం భర్త యష్ తో కలిసి తాను అక్కడ దిగిన లేటెస్ట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు రాధిక. యష్, నేను కలిసి ప్రపంచానికి దూరంగా ఎవరికీ అందని చోటులో ఉన్నాం అంటూ రాధిక తన పోస్ట్ లో తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుండగా, వాటిని యష్ ఫ్యాన్స్ మరింతగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :