“మిస్టర్ బచ్చన్” టీజర్ కోసం “కేజీయఫ్” టెక్నీషియన్

“మిస్టర్ బచ్చన్” టీజర్ కోసం “కేజీయఫ్” టెక్నీషియన్

Published on Jul 27, 2024 8:00 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మిస్టర్ బచ్చన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా పట్ల మంచి బజ్ అందరిలో నెలకొనగా ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్రెడీ వచ్చిన పాటలు మంచి హిట్ కాగా ఇప్పుడు టీజర్ ని దింపే పనిలో మేకర్స్ ఉన్నారు. అయితే ఈ టీజర్ పై సాలిడ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది..

ఈ టీజర్ పనులు శరవేగంగా పూర్తవుతుండగా ఈ టీజర్ కట్ కోసం పాన్ ఇండియా సెన్సేషన్ కేజీయఫ్ టెక్నీషియన్ ని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. ఎడిటర్ ఉజ్వల్ కుమార్ ఇచ్చిన టీజర్ కట్ తో హరీష్ శంకర్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారని అతి త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఆగస్ట్ 15న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు