స్టార్ హీరో కార్తీ కెరీర్ లో ఒక సాలిడ్ హిట్ మరియు తన కెరీర్ ని మళ్ళీ నిలబెట్టిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఖైదీ” సినిమా అని చెప్పాలి. ప్రస్తుత మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “విక్రమ్” దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా తోనే కార్తీ మంచి కం బ్యాక్ అందుకోవడమే కాకుండా తెలుగులో కూడా ఆ దర్శకుడి పేరు బాగా వినిపించింది.
ఇక ఆ తర్వాత మాస్టర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి కూడా మరింత దగ్గరయ్యాడు. అయితే ఇప్పుడు సెన్సేషనల్ హిట్ “ఖైదీ” చిత్రం ఓ దేశంలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఏకంగా 121 సిటీలు 297 స్క్రీన్స్ లో రష్యా భాషలో డబ్ అయ్యి ఈ చిత్రం అక్కడ ఈరోజు మే 19న విడుదల అవుతుందట. ఇప్పుడు ఈ సంబంధిత పోస్టర్ లే సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ కి అక్కడ ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
#Kaithi is releasing in Russia today as #Узник ! ????????@Karthi_Offl @Dir_Lokesh @SamCSmusic @sathyaDP @philoedit @prabhu_sr @4SeasonsCreati1 pic.twitter.com/cLPuYMS914
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 19, 2022