ఓటీటీ సమీక్ష : ఖాకీ – ది బెంగాల్ చాప్టర్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ సిరీస్

ఓటీటీ సమీక్ష : ఖాకీ – ది బెంగాల్ చాప్టర్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ సిరీస్

Published on Mar 24, 2025 10:52 PM IST

Khakee The Bengal Chapter

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మార్చి 20, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : జీత్, ప్రొసెన్ జిత్ ఛటర్జీ, రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ ఖాన్, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగ్ధ సింగ్ తదితరులు

దర్శకులు :డెబాత్మ మండల్, తుషార్ కాంతి రే

నిర్మాత: షీతల్ భాటియా
సంగీతం : జీత్ గంగూలీ, సంజోయ్ చౌదరి
సినిమాటోగ్రఫీ : తుషార్ కాంతి రే, అర్వింద్ సింగ్, తారా శ్రీ సాహో, సౌవిక్ బసు
ఎడిటర్ : ప్రవీణ్ కధికులొత్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

నీరజ్ పాండే సృష్టించిన లేటెస్ట్ పొలిటికల్ క్రైమ్ సిరీస్ ఖాకీ – ది బెంగాల్ చాప్టర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

సాగోర్ తాలుక్‌దార్(రిత్విక్ భౌమిక్), రంజిత్ ఠాకూర్(ఆదిల్ జాఫర్) కోల్‌కతాలో డాన్ అయిన శంకర్ బరువా అలియాస్ బాఘా(సస్వత చటర్జీ) దగ్గర పని చేస్తుంటారు. అయితే, బాఘా వద్ద నమ్మకద్రోహం చేయడంతో పాటు అతడిని చంపి అతని సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు వారిద్దరు. పవర్‌ఫుల్ లీడర్ బరుణ్ రాయ్(ప్రొసెన్ జిత్ చటర్జీ) అండదండలతో మాఫియా సామ్రాజ్యాన్ని ఏలాలని సాగోర్ చూస్తాడు. దీంతో రంజిత్‌తో అతడికి మనస్పర్థలు ఏర్పడటంతో వారిమధ్య వైరం మొదలువుతుంది. ఈ క్రమంలో ఓ IPS ఆఫీసర్ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన SIT హెడ్ అర్జున్ మైత్ర(జీత్) బాఘా మర్డర్‌తో ఈ కేసుకు సంబంధం ఉన్నట్లు కనుగొంటాడు. ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు..? బరుణ్ రాయ్‌కి వీటితో ఎలాంటి సంబంధం ఉంది.. అతని ఎజెండా ఏమిటి..? లాంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ ఇంటెన్స్ పొలిటికల్ క్రైమ్ డ్రామా సాగుతుంది.

ప్లస్ పాయింట్స్:

ఖాకీ – ది బెంగాల్ చాప్టర్ క్రైమ్, రాజకీయాలకు సంబంధించిన లోతైన విశ్లేషణ మనకు ప్రెజంట్ చేస్తుంది. నిజజీవితంలో ఇలాంటి ఘటనలు మనం ఎక్కడో ఒక చోట చూసినట్లుగా ఈ సిరీస్ చూస్తే అనిపిస్తుంది. ఇలాంటి కథనాన్ని నెరేట్ చేసిన విధానం బాగుంది.

SIT ఆఫీసర్ అర్జున్ మైత్ర పాత్రలో జీత్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన పాత్రను చాలా చక్కగా డిజైన్ చేయడంతో పాటు కథకు కావాల్సిన ఇంటెన్సిటీ ని తీసుకొచ్చారు.

అయితే, ఈ కథలో అసలు హీరోలు మాత్రం రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ అని చెప్పాలి. వారు సాగోర్, రంజిత్ పాత్రల్లో ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఇలాంటి సిరీస్‌కు అలాంటి పాత్రలే బలాన్ని చేకూరుస్తాయని వీరు నిరూపించారు.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకాంక్ష సింగ్ కథను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడింది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన డెప్త్ కొంతవరకే ఉన్నా, ఆమె దానిని డీసెంట్‌గా హ్యాండిల్ చేసింది. ఆమె పాత్రలో చిన్న ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ సస్వతా చటర్జీ, ప్రొసెన్ జిత్ చటర్జీ, శ్రుతి దాస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

కథలో మంచి పాయింట్ ఉన్నప్పటికీ, ఈ సిరీస్ యొక్క పేస్ మేజర్ డ్రా బ్యాక్ అని చెప్పాలి. కథను నెరేట్ చేయడంలో స్లో పేస్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఇలాంటి కథను చాలా త్వరగా ముందుకు తీసుకెళ్లాలి. కానీ, ఇందులోని లెంగ్తీ రన్‌టైమ్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పాలి. ముఖ్యంగా ఇందులోని నాలుగు ఎపిసోడ్స్ ఒక్కోటి దాదాపు గంట వ్యవధితో ఉండటం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి.

మరికాస్త ఫాస్ట్ పేస్, ఎంగేజింగ్ అంశాలు ఉండి ఉంటే సిరీస్ ఫలితం వేరేలా ఉండేది. చివరి రెండు ఎపిసోడ్స్‌ను ప్రేక్షకులు ముందే ఊహించగలరు. ఇక్కడ రన్‌టైమ్ పై మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

ఇక ఇందులో మరో మేజర్ డ్రాబ్యాక్ ఈ సిరీస్‌లో వాడిన బూతులు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇవి ఏ మాత్రం నచ్చవు. డైలాగ్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.

సాంకేతిక వర్గం :

నీరజ్ పాండే ఈ సిరీస్ కోసం ఓ చక్కటి పునాది అయితే వేయగలిగాడు కానీ, ఈ సిరీస్‌ను మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో తడబడ్డాడు. అటు ఇద్దరు డైరెక్టర్స్ కూడా కథను మరికొంత వేగంగా నడిపించి ఉంటే బాగుండేది. పొలిటికల్, క్రైమ్ అంశాలు చక్కగానే ప్రెజంట్ చేసిన కథనం విషయంలో జాగ్రత్త పడి ఉండాల్సింది.

ఇక సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. కానీ ఎడిటింగ్ మాత్రం చాలా నిరుత్సాహపరిచింది. చాలా సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే ఈ సిరీస్ ఇంకాస్త బెటర్‌గా కనిపించేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ఖాకీ – ది బెంగాల్ చాప్టర్ ఓ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సిరీస్‌లోని పేస్ మరియు రన్‌టైమ్ పై శ్రద్ధ తీసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్, జీత్, ప్రొసెన్ జిత్ చటర్జీ తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఎంత లెంగ్తీ కంటెంట్ అయినా చూస్తామనుకుంటే, మీరు ఈ సిరీస్‌ను ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు