“డార్లింగ్” నుండి ఆకట్టుకుంటున్న ఖలాసే సాంగ్

టాలీవుడ్ నటుడు, కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో, నభా నటేష్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. ఈ చిత్రంను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. హనుమాన్‌ చిత్రాన్ని నిర్మించిన నిరంజన్‌రెడ్డి ఈ డార్లింగ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్విన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఖలాసే సాంగ్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది.

రిలీజైన సాంగ్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, హేమంత్ డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version