మెగాస్టార్ ‘లూసిఫర్’లో కుష్బూ ?

Published on Jun 30, 2020 2:00 am IST


మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనది. హీరోకి చెల్లి పాత్ర అయిన ఈ పాత్రను తెలుగు వర్షన్ లో సీనియర్ బ్యూటీ కుష్బూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త పై చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా కుష్బూ ‘లూసిఫర్’లో ని చెల్లి పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. హీరో పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఎమోషనల్ రోల్ లో కుష్బూ పూర్తి న్యాయం చేస్తోంది. పైగా మెగాస్టార్ కి గతంలోనూ కుష్బూ సిస్టర్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికి ఈ భారీ సినిమా అవకాశం ఇచ్చారు. మరి ఈ మెగా ఛాన్స్ ను సుజీత్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More