ఆమెకు థ్యాంక్స్ చెప్పిన తారక్ !

ఆమెకు థ్యాంక్స్ చెప్పిన తారక్ !

Published on Sep 29, 2024 11:01 AM IST

దేవర బాక్సాఫీస్ పై చేస్తున్న దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు. రోజురోజుకు దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విధ్వంసం చేస్తోంది. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనను చూసి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలతో కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ దేవర సినిమా పై, ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ, ఖుష్బూ సుందర్ ఏం కామెంట్స్ చేశారంటే.. ‘అతనే నా హీరో, అతని మాస్ ఎవరూ టచ్ చేయలేరు. సెమ్మ మాస్.. నేను దీన్ని ఎలా మిస్ చేయగలను, దేవరతో అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను’ అని ఖుష్బూ తన X ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఖుష్బూ ట్వీట్ కు ఎన్టీఆర్ బదులిస్తూ ‘హాహా.. థాంక్యూ మేడమ్, దేవర మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని తారక్ సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక సినిమా విషయానికి వస్తే.. రెండు పాత్రల్లో ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో తారక్ అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది. సినిమా పై కొందరు నెగిటివ్ ప్రచారం చేసినా.. సినిమాకి మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో విలన్స్ గా మెప్పించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు