‘దర్శన్‌ కేసు’ పై స్టార్ హీరో కీలక వ్యాఖ్యలు

‘దర్శన్‌ కేసు’ పై స్టార్ హీరో కీలక వ్యాఖ్యలు

Published on Jun 17, 2024 12:36 PM IST

హీరోయిన్ పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ స్టార్ హీరో దర్శన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసు కన్నడనాట సంచలనం అయ్యింది. ఈ నేపథ్యంలో మరో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఈ కేసు పై స్పందించారు. ఇంతకీ, కిచ్చా సుదీప్ ఏం చెప్పారంటే.. ‘మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుసు. ఎందుకంటే.. మేం పోలీసుస్టేషన్‌కు వెళ్లి సమాచారం తెలుసుకోవడం లేదు.

ఏది ఏమైనా నిజాలను వెలికితీసేందుకు మీడియా, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్న ట్లు నాకు అర్ధం అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. మృతుడి భార్యకి, ఇంకా భూమ్మీదకు రాని ఆ వ్యక్తి బిడ్డకు న్యాయం జరగాలి. న్యాయం గెలవాలి’’ అంటూ కిచ్చా సుదీప్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు