ఓటిటిలోకి వచ్చేసిన కిచ్చా క్రేజీ థ్రిల్లర్ “విక్రాంత్ రోణ”.!

ఓటిటిలోకి వచ్చేసిన కిచ్చా క్రేజీ థ్రిల్లర్ “విక్రాంత్ రోణ”.!

Published on Sep 16, 2022 7:59 AM IST

కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “విక్రాంత్ రోణ” కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి మోస్ట్ అవైటెడ్ గా రిలీజ్ అయ్యింది. మరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ క్రేజీ థ్రిల్లర్ మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబట్టి హిట్ గా నిలిచింది.

ఇక ఇదిలా ఉండగా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో అదరగొట్టిన ఈ చిత్రం ఇపుడు ఫైనల్ గా ఓటిటి లో అలరించేందుకు వచ్చేసింది. ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా మరి దానిలో ఈ చిత్రం ఈరోజు నుంచే స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. మరి ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ చూడాలి అనుకునే వాళ్ళు చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక ఈ చిత్రానికి అయితే అనూప్ భండారి దర్శకత్వం వహించగా జాక్వలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు