‘హనుమాన్’ మేకర్స్ తో కిచ్చా సుదీప్ ‘BRB’ !

‘హనుమాన్’ మేకర్స్ తో కిచ్చా సుదీప్ ‘BRB’ !

Published on Sep 2, 2024 1:01 PM IST

దర్శకుడు అనూప్ భండారి దర్శకత్వంలో కన్నడ బాద్‌ షా కిచ్చా సుదీప్ నటిస్తున్న కొత్త సినిమా బిల్లా రంగా బాషా(BRB). హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌ తో భారీ కాన్వాస్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా 2209 A.D లో జరిగే కథను పరిచయం చేసే కాన్సెప్ట్ వీడియోతో పాటు ‘బిల్లా రంగ బాషా’ యొక్క ‘అఫీషియల్ లోగో’ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ కాన్సెప్ట్ వీడియోలో.. క్రీ.శ. 2209లో జరిగిన భవిష్యత్తు గురించిన సంఘటనలు కనిపించాయి. ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్ మరియు తాజ్ మహల్ అన్నీ ధ్వంసమయ్యాయి. ఒక వ్యక్తి అన్నింటినీ జయించినట్లు చూపించారు. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు మరియు జాతులు, వాతావరణాన్ని చూపించారు. మొత్తానికి కథలోని థీమ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.

ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “కిచ్చా సుదీప్‌తో అనూప్‌ భండారి కలయికలో మరో సినిమా రాబోతుందని తెలిసి చాలా ఎగ్జైట్ అయ్యాం. విక్రాంత్ రోనా తెలుగులో విజయవంతమైన సంగతి తెలిసిందే. ది. బిల్లా రంగ బాష కథ విన్నప్పుడు, ఇది మేమే నిర్మించాలని నిర్ణయించుకున్నాం. సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌తో జతకట్టడం అనేది ఎప్పుడూ గొప్ప అవకాశం. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు