సమీక్ష: మాక్స్ – మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది

సమీక్ష: మాక్స్ – మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది

Published on Dec 27, 2024 4:06 PM IST
Kichcha Sudeep Max Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 27, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : కిచ్చా సుదీప, వరలక్ష్మి శరత్‌కుమార్, సునీల్, సంయుక్త హోర్నాడ్, సుకృత వాగ్లే, శరత్ లోహితస్వ, మరియు అచ్యుత్ కుమార్

దర్శకుడు : విజయ్ కార్తికేయ

నిర్మాతలు : కలైపులి ఎస్. థాను, కిచ్చా సుదీప్

సంగీత : బి అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ : శేఖర్ చంద్ర

కూర్పు: ఎస్ ఆర్ గణేష్ బాబు

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కన్నడ అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ హీరోగా నటించిన అవైటెడ్ మాస్ యాక్షన్ డ్రామా “మాక్స్” కూడా ఒకటి. అయితే కన్నడలో ఈ డిసెంబర్ 25న రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగులో ఈ 27న వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. మాక్స్ గా పిలవబడే అర్జున్ మహాక్షయ్ (కిచ్చా సుదీప్) సాలిడ్ ట్రాక్ రికార్డుతో చాలా చోట్ల తన చర్యలతో ట్రాన్స్ఫర్ లు, సస్పెన్షన్ లు అవుతూ ఆఖరికి ఓ పోలీస్ స్టేషన్ కి సీఐ గా ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ స్టేషన్ లో తాను ఇంకా ఛార్జ్ తీసుకోవాల్సిన సమయం కంటే ముందే తన యాక్షన్స్ స్టార్ట్ చేసేస్తాడు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ కి ఇద్దరు మంత్రుల కొడుకులని డ్రగ్స్, లేడీ పోలీస్ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు జైల్లో వేస్తారు. అయితే అనూహ్యంగా వీరిద్దరూ అదే పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పదంగా చనిపోతారు. దీనితో ఇది మాక్స్ అండ్ టీం కి పెద్ద సమస్యలా మారేలా వెళుతుంది. ఈ క్రమంలో మాక్స్ చేసిన ప్లానింగ్స్ ఏంటి? వాళ్లిద్దరూ ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారు? మాక్స్ తన టీం కోసం ఏం చేస్తాడు అనేది తెలియాలి అంటే ఈ చిత్రంని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో బిగ్గెస్ట్ హైలైట్ ఏదన్నా ఉంది అంటే అది అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ అనే చెప్పాలి. ఈ సినిమా తన ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా మాస్ ఆడియెన్స్ కి ఒక ఫీస్ట్ లా సాగుతుంది అని చెప్పొచ్చు. మెయిన్ గా సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రంలో సూపర్బ్ గా ఉంది. దానికి తోడు తనపై స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు అన్నీ మంచి ట్రీట్ ని అందిస్తాయి.

అలాగే సుదీప్ నటన తన మ్యానరిజంలు కానీ సినిమాలో మెప్పిస్తాయి. దీనితో తన సైడ్ నుంచి మాత్రం ఒక కంప్లీట్ ఫీస్ట్ ని అందిస్తాడు అది డెఫినెట్ గా అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఇక ఇది కాకుండా తాను చేసే కొన్ని ప్లానింగ్స్ అలాగే మైండ్ గేమ్ సీక్వెన్స్ లు ఇంట్రెస్ట్ గా సాగుతాయి.

అలాగే ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్ తన నెగిటివ్ షేడ్ ఉన్న పోలీస్ పాత్రలో మెప్పిస్తారు. అలాగే సునీల్ కూడా తన రోల్ లో సాలిడ్ పెర్ఫామెన్స్ అందించారు ఇక వీరితో పాటుగా తమిళ్ నుంచి కన్నడ నుంచి ఉన్న కొందరు ప్రముఖ నటులు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేకూర్చారు.

ఇక వీటికి మించి సినిమాలో ఇంకా ఇంప్రెస్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే అది యాక్షన్ సీక్వెన్స్ లలో సాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. అజనీష్ లోకనాథ్ సాలిడ్ వర్క్ మంచి మాస్ అండ్ స్టైలిష్ బీట్స్ తో పలు సీన్స్ ని బాగా ఎలివేట్ చేసాడు. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మాస్ ని అలరించే అంశాలు ఉన్నాయి కానీ సరైన కథ లేదని చెప్పాలి. సినిమాలో కనిపించే సెన్సిటివ్ పాయింట్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఇంకా దీనికి తోడు కొన్ని సీన్స్ లో మాస్ డైలాగ్స్ లాంటివి కూడా చాలా సినిమాల్లో వినేసినట్టే ఉంటాయి. దీనితో ఇవి కొంచెం రొటీన్ ఫీల్ కలిగిస్తాయి.

ఇక వీటితో పాటుగా సినిమాలో బ్యాక్ డ్రాప్ కూడా మనకి కార్తీ “ఖైదీ” తరహాలోనే అనిపిస్తుంది. ఇంకా సుదీప్ తో ఉండే గ్యాంగ్ నటీనటులు సినిమాలో కొంచెం ఓవర్ యాక్షన్ లా చేస్తారు. మెయిన్ గా ప్రీ క్లైమాక్స్ లో సుదీప్ తో పోలీస్ స్టేషన్ లో ఓ సీన్ లో సుదీప్ తో మాట్లాడే డైలాగులు చాలా అతి గా అనిపిస్తాయి.

దర్శకుడు ఇలాంటి వాటిని తగ్గించి ఉంటే సినిమా ఇంకా నాచురల్ గా ఫీస్ట్ అందించి ఉండేది. ఇంకా కొన్ని సీన్స్ ఊహించదగిన విధంగానే ఉంటాయి. వీటితో పాటుగా సుదీప్ బ్యాక్ స్టోరీ కోసం ఏమన్నా చూపించి బాగుండేది. అంత ఎలివేషన్స్ తనకి ఇచ్చి సింపుల్ గా ముగించేసినట్టుగా చిన్న అసంతృప్తి తన రోల్ విషయంలో ఉంటుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు దాదాపు బాగున్నాయని చెప్పొచ్చు. మెయిన్ గా ఒక్క రాత్రిలో నడిచే సినిమాగా మంచి విజువల్స్ తో తెరకెక్కించారు. ఇందులో సాంకేతిక టీం కి మంచి మార్కులు ఇవ్వొచ్చు. మెయిన్ గా సినిమాటోగ్రఫీ, సంగీతం చాలా ప్లస్ అయ్యాయి. కొన్ని సీన్స్ లో కెమెరా మూమెంట్స్, అజనీష్ స్కోర్ లు సాలిడ్ గా ఇంప్రెస్ చేస్తాయి. తెలుగు వెర్షన్ డబ్బింగ్ బాగుంది. అలాగే ఎడిటింగ్ కూడా పర్వాలేదు. కొన్ని చోట్ల వి ఎఫ్ ఎక్స్ చాలా వీక్ గా ఉన్నాయి.

ఇక దర్శకుడు విజయ్ కార్తికేయన్ విషయానికి వస్తే.. తాను రొటీన్ లైన్ నే తీసుకున్నప్పటికీ మాస్ ఆడియెన్స్ కి ఒక సగటు ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సినిమా నడిపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మెయిన్ గా రేసి స్క్రీన్ ప్లే సినిమాలో ఎంగేజ్ చేస్తుంది. మంచి మాస్ మూమెంట్స్ తో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ ని తాను బాగా వాడుకొని డీసెంట్ ట్రీట్ ని అయితే అందించారు. దీనితో ఈ సినిమాకి తన వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మాక్స్” చిత్రం మాస్ ఆడియెన్స్ కి సుదీప్ ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇస్తుంది. ముఖ్యంగా సినిమాలో మాస్ యాక్షన్ మూమెంట్స్ వీటికి మించి సుదీప్ సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ లు సినిమాలో మెప్పిస్తాయి. కాకపోతే కొంచెం రొటీన్ లైన్ అక్కడక్కడా కొన్ని సీన్స్ ఓవర్ గా అనిపిస్తాయి. ఇవి మినహా ఈ సినిమా అయితే ఆడియెన్స్ కి ఎంగేజ్ చేస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు