రేసు గుర్రం బ్రహ్మండమైన విజయం తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి మరో చిత్రం చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారు. రేసుగుర్రం చిత్రం నిజంగానే రేసు గుర్రం లా బాక్స్ ఆఫీసు వద్ద అందరి అంచనాలను అందుకొంది. ఇది అల్లు అర్జున్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం కొత్త వారితో కలిసి ఓ చిత్రాన్ని తీసే పనిలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నారు. నల్లమలపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. కిక్-2 తరువాత ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నారు. కిక్-2 ఖచ్చితంగా కిక్ కు సీక్వెల్ కాదని, అందులోని కొన్ని ప్రధాన పాత్రలను మాత్రమే తీసుకొని విభిన్నంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఓ ప్రముఖ పత్రికకు తెలిపారు. ఇలియానా, రవితేజ జంటగా నటించిన కిక్ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది.
రవితేజ ప్రధాన పాత్రగా నటిస్తున్న కిక్ 2 చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.