టాలీవుడ్ హీరో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కిక్. ఇలియాన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మార్చ్ 1, 2024 న ఈ కిక్ మూవీ రీ రిలీజ్ కానుంది. రవితేజ ఇటీవల వెంకీ మూవీ రీ రిలీజ్ తో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నారు. మరోసారి ఫ్యాన్స్ కి కిక్ చిత్రం తో మాంచి ఎంటర్ టైన్మెంట్ అందించనున్నారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో శ్యామ్ మరొక కీలక పాత్రలో నటించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.